39.2 C
Hyderabad
April 25, 2024 16: 00 PM
Slider ఆధ్యాత్మికం

ఆనందమనేది అంతరంగంలోనే ఉంది

#guruji

ఆనందమనేది మన అంతరంగంలోనే ఉంది అంటూ  ఉచిత అంతర్ముఖ యోగ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా భిక్షమయ్య గురూజీ  హాజరై అంతర్ముఖ జ్ఞానాన్ని , యోగ రహస్యాన్ని గురించి చార్ట్ ద్వారా వివరించడంతో పాటు ఎల్.ఇ.డి. ప్రొజెక్టర్ ద్వారా వీడియోలతో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శిక్షణను ఇచ్చారు .  ఖమ్మం లో జరిగిన కార్యక్రమంలో గురూజీ స్వయంగా మంత్రాన్ని ఉపదేశించి సమాధి అభ్యాసాన్ని ప్రయోగపూర్వకంగా సాధన చేయించడం జరిగింది .

ప్రస్తుతం మానవజాతిలో అసంతృప్తి , అసహనం తారాస్థాయికి చేరుకుందని , దీని మూలంగా మానవుడు సత్యమైన , నిత్యమైన , శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టు కొని అల్పమైన , అనిత్యమైన , అశాశ్వతమైన శారీరక సుఖానికి అలవాటు పడ్డాడని అన్నారు . మేధావు లంతా శారీరక సుఖానికి , ఆనందానికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించలేక పోతున్నారని  వాస్తవానికి ఆనందమనేది మన అంతరంగంలోనే ఉంది , అంతరంగమందలి ఆనందాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత అని తెలిపారు . అందుకు సద్గురువు పర్యవేక్షణలో బ్రహ్మోపదేశం ద్వారా మంత్రాన్ని పొంది , పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవం పొందగలిగితే అన్నిరకాల సమస్యలకు పరిష్కారం దొరికింది అన్నారు .

యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం , సమర్థత , లౌక్యం , మానసిక ప్రశాంతత , దీర్ఘాయుష్షు , పరిపూర్ణ వ్యక్తిత్వం ఏర్పడి జీవితం ఆనందమయం అవుతుందని , ఇల్లు దేవాలయం అవుతుందని బోధించారు . యోగా ద్వారా వంశపార్యపర్యంగా తల్లిదండ్రుల ద్వారా ఏర్పడిన జీన్సు ను సైతం మార్పు చేసుకోవచ్చునని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు . ఇది సైన్స్కు సైతం సాధ్యపడని విషయం అని ఒక్క యోగ సాధన ద్వారానే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి ధ్యానమండలి ఖమ్మం శాఖ నిర్వాహకులు గురూజీ కె. చంద్రశేఖరరావు , పెండ్లి శ్రీనివాస్ రెడ్డి , కిలారు శ్రీనివాస్ రావు , కోడుమూరు శ్రీనివాసరావు , స్వరూప , పుష్పలత , లీలావతి తదితరులు పాల్గొన్నారు .

Related posts

దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే

Satyam NEWS

మాదిగల గోడు పట్టించుకోని కొల్లాపూర్ ఎమ్మెల్యే

Sub Editor

అధికారులు మానవతా దృక్పథంతో సుపరిపాలన అందించాలి

Bhavani

Leave a Comment