36.2 C
Hyderabad
April 25, 2024 19: 13 PM
Slider మహబూబ్ నగర్

లీగల్ హెరాస్మెంట్: లాక్ డౌన్ లో ఇంటికి లాక్

#Kalwakurthy Municipality

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మున్సిపాలిటీ కమిషనర్ ఇల్లు,దుకాణం టాక్స్  కట్ట లేదంటూ ఈ లాక్ డౌన్ లో  ఇంటికి లాక్ వేశారు. కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్ రోడ్ లో ఉన్న వికలాంగుడు అయిన ఖాదర్ ఇంటి టాక్స్ కట్టలేదని వారి స్వగృహంలో ఉన్న ఆడ వారిని సైతం బయటికి రమ్మని ఇంటికి తాళం వేస్తామని అందరిని బయటికి వెళ్లగొట్టి మున్సిపల్ కమిషనర్ తాళాలు వేశారు.

ఆమె భర్త బ్రతుకుదెరువు కోసం చిన్న టీ స్టాల్ నడుపుతున్నాడు. ప్రస్తుత లాక్ డాన్  కారణంగా గత మూడు నెలల నుండి టీ బండి మూసివేయడంతో కొన్ని రోజులుగా పూట గడవడమే కష్టంగా ఉందని ఇంటి టాక్స్ కొంచెం గడువు ఇస్తే కడతామని చెప్పినా మున్సిపల్ కమిషనర్ తను ముందు బయటకి రమ్మంటు ఇంట్లో ఉన్న వారందరిని బయటికి వెళ్లగొట్టి తాళం వేశారు.

ఇరుగు పొరుగు వారు కల్పించుకోవడం తో తలం తీసి వెళ్లిపోయినట్లు సబిహబేగం ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె సత్యం న్యూస్ కు తెలిపారు.

సొంత ఇల్లు చక్కబెట్టుకో కుండా పక్కింటి పై ప్రతాపం

పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ సొంత  మున్సిపాలిటీ దుకాణాల అద్దె కొన్ని సంవత్సరాల నుండి లక్షల్లో పెండింగ్ లో ఉన్న వసూలు చేయకుండా వారి ప్రతాపం మొత్తం పట్టణ ప్రజల పై చూపిస్తున్నారు. సొంత ఇంటిని చక్కదిద్దు కోకుండా పట్టణ ప్రజలపై వికలాంగులపై రోజువారి కూలీలపై ప్రతాపం చూపడాన్ని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 అదేవిధంగా గత వారంలో వీరి ప్రతాపం పోలీస్ స్టేషన్  లో ఉన్న బల్బులను ఇవి మావి అంటూ తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు పోలీస్ స్టేషన్లో సైతం చెత్తను స్వీకరించకుండా  తాగు నీటిని సైతం నిలిపి వేశారు.  ప్రజలపై పోలీస్ స్టేషన్లపై కక్ష సాధింపు  గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు  జోక్యం చేసుకొని కక్ష సాధింపు చర్యల కు పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Related posts

వనపర్తిలో డ్రా పద్దతిలో బార్ లు కేటాయించిన కలెక్టర్

Satyam NEWS

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి పెరిగిన మరింత క్రేజ్‌

Sub Editor

పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి సముచిత స్థానం: నందమూరి సుహాసిని

Satyam NEWS

Leave a Comment