32.7 C
Hyderabad
March 29, 2024 12: 30 PM
Slider హైదరాబాద్

31న ‘ఊహలకే ఊపిరొస్తే’ కవితా సంపుటి ఆవిష్కరణ

#kharanath

హైదరాబాద్ పాతనగర కవుల వేదిక కన్వీనర్ కె.హరనాథ్ “ఊహలకే ఊపిరొస్తే” కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 31న జరగనున్నది. శ్రీ శోభకృత్ ఉగాది సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు.

ఈ కార్యక్రమం రవీంద్రభారతి సమావేశ మందిరం మొదటి అంతస్తులో 31న (శుక్రవారం) ఉదయం 10.30 కి జరుగుతుంది. ఈ సందర్భంగా కవి సమ్మేళనం కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశిష్ట అతిథిలుగా రాజధాని బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరీశంకర్, నేషనల్ కన్జ్యుమర్ రైట్స్ కమిటీ తెలంగాణ స్టేట్ వైస్ ఛైర్మన్ డా. కారుకాల అనితారెడ్డి హాజరవుతారు.

ఆత్మీయ అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సత్యం న్యూస్. నెట్ చీఫ్ ఎడిటర్ పులిపాక సత్యమూర్తి, ప్రముఖ కవి, విమర్శకులు సుధామ, డైరెక్టర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ ఎ. కామేశ్వరరావు, అడిషినల్ కలెక్టర్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లా ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొనే ఈ కార్యక్రమం అనంతరం అభినందన సత్కారం పురస్కారాలు, కవి సమ్మేళనంతో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.

Related posts

సి ఐ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే

Satyam NEWS

గులాంనబీఆజాద్ పరువు తీసేసిన కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత జాతరకు అంతా సిద్ధం

Satyam NEWS

Leave a Comment