ఎట్టకేలకు ముహూర్తం ఖరారైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గవిస్తరణ ఆశించిన రీతిలోనే జరగబోతున్నది. మంత్రివర్గంలోకి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నాయకుడు టి.హరీష్ రావు వచ్చి చేరబోతున్నారు. అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ లకు మంత్రివర్గంలో స్థానం లభించబోతున్నది. మంత్రి వర్గం నుంచి ఎవరినైనా తీసేస్తారో ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. పార్టీలో ఇటీవల తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పడి వరకూ వెల్లడైన పేర్లతో ఖరారు అవుతున్నది.
previous post
next post