తెలంగాణ మంత్రి వర్గ సభ్యులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేయడంతో మొత్తం మంత్రుల సంఖ్య 18కి చేరింది. నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో హరీశ్‌రావు (సిద్దిపేట) తోపాటు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం) ఉన్నారు. తెలంగాణలో రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిపారు. రాజ్‌భవన్‌లో అంగరంగవైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వీరితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే శాఖలను కేటాయించారు. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌రావుకు ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు. కీలకమైన విద్యాశాఖను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దక్కించుకున్నారు. ఇప్పటి వరకూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నజగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ అప్పగించారు. గంగుల కమలాకర్ కు బిసి సంక్షేమం, పువ్వాడ అజయ్ కుమార్ కు రవాణా, శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ కు ఎస్ సి సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం అప్పగించారు.
previous post
next post