హైదరాబాద్ లోని మాదాపూర్ దస్ పల్లా హోటల్ లో జరిగిన మిస్ మ్యాచ్ సినిమా ఆడియో ఫంక్షన్ కు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సినిమా రంగంలో కొత్త తరం హవా నడుస్తోందని అన్నారు. ముఖ్యంగా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కథలతో, కొత్త దర్శకులు, కొత్త నటీనటులు వస్తూ అద్భుతమైన విజయం అందుకుంటున్నారని ఆయన అన్నారు.
అలాగే మిస్ మ్యాచ్ కూడా అదే కోవలో కన బడుతుందని అన్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా అని విన్నాను, ఈ సినిమాలో ఒక యువకుడు తన ప్రేమికురాలు విజయం కోసం పడిన తపనను చూపిన ఒక చక్కటి సందేశాత్మక చిత్రం ఇది అని ఆయన అన్నారు.