40.2 C
Hyderabad
April 19, 2024 18: 47 PM
Slider మెదక్

కళ్యాలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

#MinisterHarishRao

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎంతగానో శ్రమిస్తూ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్​రావు అన్నారు.

శనివారం సిద్దిపేట జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డితో కలిసి చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన అర్హులైన 112 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్​ చెక్కులను అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్​రావు మాట్లాడుతూ పేద ప్రజలు, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం ధ్యేయంగా పని చేస్తూ ఎల్లప్పుడూ వారి సంక్షేమం కోసం శ్రమిస్తోందన్నారు.

ఈ విషయంలో సీఎం కేసీఆర్​ ప్రజోపయోగ్యమైన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు.

ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్​ ద్వారా ఆడపిల్లలకు రూ.1,00,116 అందిస్తున్నారని అన్నారు.

ఆడకూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయడం ఎంత కష్టమో తమకు తెలుసునని అందుకే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పెళ్ళికూతురు తల్లిపేరుపై అందిస్తామని మంత్రి హరీష్​రావు వివరించారు.

ఈ కార్యక్రమంలో చేగుంట, నార్సింగి  శ్రీనివాస్​, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, తహశీల్దార్​ విజయలక్ష్మి, నాయకులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు ఖాతాలో కందుల డబ్బులు జామ చేయాలి

Satyam NEWS

ఎంఐఎం అధినేత ఒవైసీపై దేశద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

జర్నలిస్టుల మహాసభను  జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment