27.7 C
Hyderabad
April 24, 2024 09: 01 AM
Slider నల్గొండ

భావితరాలకు భవిష్యత్తు కోసమే హరితహారం

#Chityala Municipality

భావితరాల భవిష్యత్తు కోసం హరితహారం కార్యక్రమం చేపట్టారని  చిట్యాల మునిసిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి అన్నారు. హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా చిట్యాల పట్టణం 1వ వార్డు శివనేనిగూడెం లో  మొక్కలు నాటి నీళ్లు పోశారు.

అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శం అన్నారు. 6వ విడత హరితహారం లో భాగంగా శివనేని గూడెంలో ఇంటి ఇంటికి 5 పండ్ల మొక్కలను మునిసిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి పంపిణీ చేశారు.

 హరితహారం లో భాగంగా  ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ ఐత ప్రభాకర్, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ,శేపురి రవీందర్ పాల్గొన్నారు.

ఇంకా, సింగల్ విండో వైస్ ఛైర్మన్ మెండే సైదులు, నాయకులు జిట్ట బొందెయ్య, సిలువేరు శేఖర్, కన్నెబొయేన శ్రీశైలం, జగిని బిక్షం రెడ్డి, రుద్రవరం యాదయ్య, బొబ్బలి బిక్షం రెడ్డి,గోకుల సత్తిరెడ్డి, చిత్రగంటి ప్రవీణ్ తదితరులు కూడా  పాల్గొన్నారు.

Related posts

బొలెరో కారు లారీ ఢీ: ముగ్గురి మృతి

Bhavani

భూ సేకరణలో కోర్టు ధిక్కరణపై ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష

Satyam NEWS

పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి

Satyam NEWS

Leave a Comment