40.2 C
Hyderabad
April 24, 2024 16: 55 PM
Slider నల్గొండ

హరితహారాన్ని పండుగలా జరుపుకోవాలి

#harita haram

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని జూలై ఒకటో తేదీ నుంచి ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకోవాలని ఎం పి పి గూడెపు శ్రీనివాస్ అన్నారు.  

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కరక్కాయల గూడెం, మర్రిగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీని పల్లె ప్రకృతి వనాన్ని గురువారం శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని,ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని మొక్కలు నాటాలని అన్నారు.

ఒక్కొక్కరు ఒక మొక్కను నాటి అది నీడనిచ్చే వరకు కాపాడినట్లైతే అది మనకు నీడని,తద్వారా కాలుష్యాన్ని పారద్రోలి, సమృద్ధిగా వర్షాలు కురిసి మానవ మనుగడకు దోహద పడతుందని అన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని,ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక యజ్ఞంలా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు  నాటాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో కరక్కాయలగూడెం మర్రిగూడెం సర్పంచులు కీతా జయమ్మ ధనమూర్తి, గళ్ళ సైదులు, ఎంపిటిసి వెంకటేశ్వర్లు, ఎపిఓ శైలజ, గ్రామ కార్యదర్శులు గుండు సతీష్, జ్యోతి, టెక్నికల్ అసిస్టెంట్ అరుణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ

Satyam NEWS

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

మేడ్చల్ ప్రజలు ఉచిత మంచినీటికి అర్హులు కాదా?

Satyam NEWS

Leave a Comment