40.2 C
Hyderabad
April 19, 2024 17: 42 PM
Slider మహబూబ్ నగర్

హరితహారం నర్సరీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

#WanaparthyCollector

తెలంగాణకు హరితహారం కింద చేపట్టిన నర్సరీల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని

వనపర్తి జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ భాష హెచ్చరించారు. గురువారం ఆమె వనపర్తి,  గోపాల్పేట మండలాలలోని పలు గ్రామాలలో హరిత హారం నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా జిల్లా కలెక్టర్ వనపర్తి మండలం చిమనగుంటపల్లి  నర్సరీని తనిఖీ చేశారు .నర్సరీలో బ్యాగులలో నాటిన మొక్కలకు సంబంధించిన సమాచారాన్ని బోర్డులపై ఏర్పాటు చేయాలని, ఎలాంటి మొక్కలు పెంచుతున్నారో బోర్డులో ఉండాలని,  నర్సరీ నిర్వాహకులను అడిగారు.

నర్సరీలో 22,000 మొక్కలు పెంచేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు నర్సరీ నిర్వాహకులు తెలిపారు. గత సంవత్సరం చేపట్టిన ఈత మొక్కలు పూర్తి పెద్దగా అయిపోయి పనికిరాకుండా పోతాయని, వెంటనే వాటిని నాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

సర్పంచ్ లకు కూడా నర్సరీ బాధ్యతలు

అదేవిధంగా వనపర్తి నుండి చిమనగుంట  పల్లికి వచ్చే దారిలో అక్కడ క్కడ ఖాళీ  గా ఉన్న చోట రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించాలని ఆదేశాలు జారీ చేశారు. నర్సరీ లో మొక్కలు మొలకెత్తే తేదీని ముందుగానే బోర్డు పై ఏర్పాటు చేయాలని, ప్రతి బెడ్ దగ్గర ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తెలంగాణకు హరిత హారం నర్సరీ నిర్వహణ లో సర్పంచ్  లకు కూడా బాధ్యత ఉంటుందని, అందువల్ల గ్రామ సర్పంచులు కూడా నర్సరీలను చూసుకోవాలని ఆమె కోరారు.  ఖాళీ బెడ్లలో మందార, గన్నేరు వంటి పూల మొక్కల  అంట్లను నాటాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అంకూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నర్సరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు .నర్సరీ చుట్టూ కంచె, గేటు ఏర్పాటు చేయాలని అన్నారు. నర్సరీలో ఏలాంటి మొక్కలు పెంచుతున్నారని అడగగా సీతాఫలం, శ్రీ గంధం చెట్లు పెంచుతున్నామని పంచాయతీ కార్యదర్శి తో పాటు టెక్నికల్ అసిస్టెంట్ కలెక్టర్కు వివరించారు.

నర్సరీలను పట్టించుకోని సర్పంచ్ లకు శ్రీముఖం

నర్సరీ నిర్వహణ సక్రమంగా లేకపోవడం నిర్దేశించిన మొక్కలు కాకుండా ఇతర మొక్కలు పెంచటం, నర్సరీ  బెడ్ల నిర్వహణ పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించినందుకు గాను పంచాయతీ కార్యదర్శి పృథ్వి కి శ్రీముఖం జారీ చేయాలని డి ఆర్ డి ఓ ను ఆదేశించారు. అదేవిధంగా సాంకేతిక సహాయకున్నీ సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నర్సరీ లో ఇతర మొక్కలతో పాటు, ఇంటి పెరట్లో  నాటే పండ్లు,పూల్ మొక్కలు  పెంచాలని చెప్పారు.

ప్రతి ఇంటికి కనీసం ఆరు మొక్కలు  ఇచ్చేలా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిర్మాణంలో ఉన్న కల్వర్టును  పరిశీలిస్తూ త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వెంట  ఇన్ ఛార్జ్ డిఆర్డిఓ కోదండరాములు, వనపర్తి ఎంపీడీవో రఫీకున్నిసాబేగం, చిమనగుంట పల్లి సర్పంచ్ రామేశ్వరి, అంకూర్ ఎంపిటిసి రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

హృదయ రాణి

Satyam NEWS

హాలీవుడ్ ను తలదన్నే గ్రాఫిక్స్ సృష్టించిన హైదరాబాద్ కంపెనీ

Satyam NEWS

ఘనంగా మంచు విష్ణు ‘జిన్నా’ టీజర్ విడుదల వేడుక

Satyam NEWS

Leave a Comment