ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ అత్యాచారం కేసులో నిందితుడైన వివాదాస్పద నేత, ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకునే ఆలోచనే లేదని బిజెపి స్పష్టం చేసింది. ‘ఎవరికైనా మద్దతిచ్చే స్వేచ్ఛ గోపాల్ కందాకు ఉంది. కానీ మేం ఆయన మద్దతు తీసుకోవాలని అనుకోవట్లేదు. ఆయనను ప్రభుత్వంలోకి తీసుకుంటామనే ప్రశ్నే లేదు’ అని హర్యానా బిజెపి నేత అనిల్ విజయ్ తెలిపారు. ఏ పార్టీకి సరైన ఆధిక్యం రాని హర్యానాలో జన్‌నాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపి రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వానికి మళ్లీ ఖట్టరే నేతృత్వం వహించనున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఖట్టర్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత సీఎం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
previous post