ఈనెల 9న హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ అన్నమయ్య జిల్లా రాజంపేటకు రానున్నారని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజంపేటలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విద్యా సంస్థ యొక్క సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో మరియు అన్నమాచార్య విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. హర్యానా గవర్నర్ పర్యటన మేరకు జిల్లా అధికారులందరికీ తగిన ఆదేశాలను ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు.