ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ డీ కొట్టడం తో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా లో ఈ ఘటన జరిగింది.పోలీస్ ల కధనం ప్రకారం హాసన్ పర్తీ లో పాసెంజర్లతో వెళ్తున్న ఓ ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఆటో పూర్తిగా ధ్వంసమయ్యింది.
సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం అస్పత్రికి తరలించారు. శవాలను మార్చురీకి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.