40.2 C
Hyderabad
April 24, 2024 18: 55 PM
Slider ప్రత్యేకం

ఖాకీల్లో తొణికిన మానవత్వం: హ్యేట్సాఫ్ చెబుతున్న సత్యం న్యూస్. నెట్!

#police

కరుడుగట్టిన ఖాకీల కూడా మానవత్వం ఉంటుందా…? స్టేషన్ కు వచ్చే బాధితుల గోడు పరిష్కరించడంలో వారు చెప్పే అబద్ధాలు తో అనునిత్యం ఆందోళన తో ఉండే అదే పోలీసులు. .ఒక్క సారి మానవత్వం ప్రదర్శిస్తే…! అదే జరిగింది… ఏపీ రాష్ట్రంలో ని విజయనగరం రూరల్ పోలీసులు.కొన్నాళ్ల కిందట…ఒడిశా సమీపంలో ఓ భర్త…మృతి చెందిన తన భార్య మృతదేహాన్ని. భుజాన వేసుకుని వెళ్లిన ఘటన మాదిరి గానే…ఏపీ రాష్ట్రంలో ని విశాఖ హైవేపై అనిల్ నీరుకొండ హాస్పిటల్ లో ఒడిశా కు చెందిన ఓ అసామి తన భార్య ను…ఆటో లో…విజయనగరం జిల్లా కు వచ్చే క్రమంలో ఆటోలో ఉన్న తన భార్య మృతి చెందడంతో… ఆటో డ్రైవర్ అక్క డే వాళ్లను వదిలేసి వెళ్లిపోయారు.

దీంతో అతగాడు…ఒడిశా కు వెళ్లేందుకు చెల్లూరు సమీపంలో భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని వెళుతుండటాన్ని గుర్తించిన స్థానికులు… పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన రూరల్ సీఐ తిరుపతి రావు…గంట్యాడ ఎస్ఐ కిరణ్ తో ఘటనా స్థలికి వెళ్లి… బాధితుడు..మృతి చెందిన అతని భార్య ను..దగ్గరుండి ఆంబులెన్స్ మాట్లాడి…పొరుగు రాష్ట్ర మైన ఒడిశా కు పంపించి…మానవత్వం చాటుకున్నారు.

ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ  కి చెందిన 30 ఏళ్ల ఈడే గురు అనే మహిళ అనారోగ్య కారణాలతో అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం భర్త సాములు  జాయిన్ చేశారు. చికిత్స అందించిన వైద్యులు చికిత్సకు స్పందించడం లేదని తిరిగి సొంత ఊరు తీసుకొని వెళ్ళిపోవాలని తెలిపారు.

చేసేది ఏమీ లేక భార్యను తీసుకొని, ఆటోలో విజయనగరం వస్తుండగా మార్గ మధ్యంలో భార్య ఈడే గురు మృతి చెందింది. ఆర్ధంతరంగా ఆటో డ్రైవరు చెల్లూరు రింగు రోడ్డులో వారిని దించేసి, వెళ్ళిపోయారు. దిక్కుతోచని స్థితిలో భర్త తన భార్య  మృతదేహాన్ని ఎలా ఒడిస్సాకు చేర్చాలో తెలియక మృతి చెందిన భార్య ను  భుజం మీద వేసుకొని, కాలి నడకన బయలుదేరగా, స్థానికులకు ఏమీ జరిగిందో తెలియక, అతను ఒడియాలో చెప్పిన విషయం అర్ధంకాక స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న రూరల్ సిఐ టివి తిరుపతిరావు, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ తో విషయం తెలుసుకొని, ఒడిస్సాలో అతని బంధువులతో ఫోనులో మాట్లాడి… వారి విజ్ఞప్తి మేరకు రూరల్ సిఐ టివి తిరుపతిరావు ఒడిస్సా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వారిని అంబులెన్స్ లో ఒడిశా రాష్ట్రం సుంకికి ఉచితంగా  రవాణా సౌకర్యం కల్పించి, మానవత్వం చూపారు. పోలీసులు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలపగా, సమయానుకూలంగా స్పందించిన పోలీసులను స్థానికులు అభినందించారు…రూరల్ పోలీసులకు హ్యేట్సాఫ్ చెబుతోంది…”సత్యం న్యూస్. నెట్.”

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

చలితో గజగజలాడుతున్న ఉత్తరభారతం

Bhavani

మీడియా మానేజిమెంట్ లో బాబు చాకచక్యం

Satyam NEWS

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ‘దళిత బంధు’పథకం అమలుచేయాలి

Satyam NEWS

Leave a Comment