Slider హైదరాబాద్

క్లారిఫికేషన్: మతి భ్రమించి పోలీసులను తిట్టాడట

#LangarHousePolice2

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసులపై చిందులేసి బండబూతులు తిట్టిన వ్యక్తికి మతి స్థిమితం లేదట. భార్య చనిపోయి ఏడాది అయిందట. అప్పటి నుంచి మతి భ్రమించిందట. ఇదీ స్టోరీ. ఏం చేస్తున్నాడో అతనికి తెలియదట. మరి అలాంటి వ్యక్తిని లాక్ డౌన్ సమయంలో మోటార్ సైకిల్ ఇచ్చి బయటకు ఎందుకు పంపారో తెలియదు.

భార్య చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట, ఆరు నెలలు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి లో చికిత్స పోందాడట. అతని వదిన వచ్చి రిపోర్ట్స్ చూపించి పోలీసుల నుంచి అతడిని తీసుకుని వెళ్లారు. అతని పేరు వేముల లోకేష్, తండ్రి పేరు రామయ్య.

బాంబులు పెట్టి పోలీసుల్ని లేపేస్తానని అన్నాడు, సర్ది చెప్పేందుకు వచ్చిన పబ్లిక్ పై కూడా తిరగబడ్డాడు. వీడియో తీస్తుంటే తీసుకో నాకేం భయం అన్నాడు. ఇలా ఎన్ని అన్నా ఎర్రగడ్డ ఆసుపత్రి ఇచ్చిన సర్టిఫికెట్ తో బయటపడిపోయాడు వేముల లోకేష్.

Related posts

కల్తీ నెయ్యి విచారణ కోసం తిరుమల చేరిన సిట్

Satyam NEWS

సోనియా రాజకీయాల నుంచి రిటైర్ కావడం లేదు

Satyam NEWS

పాతపట్నం మండలంలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment