27.7 C
Hyderabad
April 20, 2024 00: 19 AM
Slider ప్రత్యేకం

రాజ్యాంగ ఉల్లంఘన దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం

#APSecretariat

ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను, తిరుపతి అర్బన్ ఎస్ పిని, ఇద్దరు డిఎస్ పిలను, నలుగురు సిఐ లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.

అయితే ఇప్పటి వరకూ వారిపై చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇదే కాకుండా సోమవారం ఉదయం 10 గంటల నుంచి పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. ఆదివారం మధ్యాహ్నం వరకూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపి, జిల్లా కలెక్టర్ల నుంచి ఎలాంటి ఆదేశాలూ వెలువడ లేదు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏ ఒక్క చర్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. పై రెండు అంశాలూ రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తాయనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు, ఉద్యోగ సంఘాలు చెప్పడంతో రాజ్యాంగ ఉల్లంఘన నేరం నుంచి తప్పించుకోలేరని కూడా పరిశీలకులు భావిస్తున్నారు.

పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోకపోవడంతో ఎన్నికల కమిషనర్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగ పరమైన విధులు నిర్వర్తించడంలో చొరవ తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కోరారు.

రాజ్ భవన్ నుంచి కూడా సంబంధిత ఆదేశాలు ఇప్పటి వరకూ వెలువడలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తదుపరి చర్యలను ఏ విధంగా తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.

సోమవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు వెలువడే సరికి మధ్యాహ్నం దాటే అవకాశం ఉంది. ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అధికారికి కాపీ వచ్చే వరకూ వేచి చూస్తామని చెబితే అప్పటికి నామినేషన్ల దాఖలులో ఒక రోజు పూర్తి అయిపోతుంది. ఈ పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Related posts

నో సెక్యూలర్:ఢిల్లీ ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పారు

Satyam NEWS

రావులపాలెం దళిత యువకులపై కేసులు ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment