32.2 C
Hyderabad
March 28, 2024 23: 36 PM
Slider వరంగల్

రామప్ప దేవాలయంలో విజయవంతంగా హెల్త్ కాంప్

#RamappaTemple

మహా శివ రాత్రి సందర్భంగా రామప్ప దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆరోగ్య శిబిరాన్ని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య నేడు ఆకస్మికంగా సందర్శించారు.

సందర్శనలో భాగంగా అక్కడ నిర్వహిస్తున్న ఆరోగ్య సేవల పర్యవేక్షిస్తూ, వచ్చిన భక్తులకు ఆరోగ్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.

భక్తులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పైన అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మరీ ముఖ్యంగా కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టే విధంగా, ప్రతి ఒక్కరూ  మాస్కులు ధరించే విధంగా చూడాలని ఆయన కోరారు.

తరచుగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ, సామాజిక దూరాన్ని పాటించాలని, దగ్గినపుడు గాని తుమ్మినపుడు గాని మోచేతిని గాని లేదా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలని  ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య అధికారిని ఆదేశించారు.

గ్రామంలో ఎవరికైనా దగ్గు జలుబు లేదా జ్వరం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో RAT పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినయ్, రెస్పాన్స్ టీం సభ్యులు దుర్గారావు, తిరుపతయ్య, ప్రతాప్, సి హెచ్ వో సదానందం, స్టాఫ్ నర్స్ చైతన్య ,ఆరోగ్య కార్యకర్త అనురాధ ,వజ్రమ్మ  ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి

Satyam NEWS

ఫాస్ట్ యాక్షన్: చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి తరలింపు

Satyam NEWS

విదేశాల నుంచి మావోయిస్టు గణపతి ఎప్పుడొచ్చారు?

Satyam NEWS

Leave a Comment