32.2 C
Hyderabad
March 28, 2024 22: 16 PM
Slider విజయనగరం

ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి: విజయనగరం ఎస్పీ దీపిక

#healthcamp

ఈ నెల 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు పరేడ్ గ్రౌండులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  దీపిక మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అంతర్గత భద్రతకు పోలీసుశాఖ శక్తి వంచన లేకుండా పని చేస్తూ, తమ ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధవహించక పోవడం వలన, అనారోగ్యం పాలవుతున్నారన్నారు. అంతేకాకుండా, ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారన్నారు.

మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరుల త్యాగాలు వృధా కారాదని, వారి త్యాగాలను స్మరించుకొంటూ, తిరుమల నర్సింగు హోం యాజమాన్య వైద్యుల సహకారంతో పోలీసు కుటుంబాలకు, సామాన్య ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు.

ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకొని, ఆరోగ్యం మెరుగు పర్చుకొనేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో పోలీసు కుటుంబాలతో పాటు సామాన్య ప్రజలు సుమారు 200 మంది పాల్గొన్నారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేసారు.

తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న కొంతమందిని గుర్తించి, మెరుగైన వైద్యం కోసం నర్సింగు హెూమ్ కు తరలించారు. ఈ మెడికల్ క్యాంపులో తిరుమల నర్సింగు హెూం ఎం.డి. డా. తిరుమల ప్రసాద్, జనరల్ సర్జన్ డా. శివ ప్రసాద్, జనరల్ సర్జన్ డా. రాజ శేఖర్, కార్డియాలజిస్టు డా. చంద్రకుమారి పాల్గొని వైద్య సేలందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఒఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు, డా. వెంకటేశ్వర రావు, విజయనగరం డీఎస్పీ అనిల్ పుటిపాటి, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బి సీఐలు ఎన్. శ్రీనివాసరావు, జి.రాంబాబు, డీసీఆర్ బి సీఐ బి. వెంకటరావు, విజయనగరం  వన్ టౌన్ సీఐ జె.మురళీ, సీసీఎస్ సిఐ ఎస్. కాంతారావు, ఆర్ ఐలు పి. చిరంజీవి, వి. నాగేశ్వరరావు, టి.విఆర్ కె కుమార్, మరియన్ రాజు, వి. ఈశ్వరరావు, రమణమూర్తి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు,డాక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

నో వైరస్ ఓకే:చైనా యువతి భారత యువకుడి పెళ్లి

Satyam NEWS

ప్రొద్దుటూరులో మతరాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

హిట్లర్ లాంటి నియంతలే పోయారు… నెవ్వెంత?

Bhavani

Leave a Comment