ఓ పురుగు కుట్టి 82 మంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో ఆరుగురు విద్యార్థులను మెరుగైన చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగతా విద్యార్థులకు హెల్త్ క్యాంప్ పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలో 82 మంది విద్యార్థులు మొహంపై మచ్చలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్టల్ లో లైట్ కింద ఉండటం వల్ల “క్రిమి” అనే పురుగు కుట్టినా, శరీరంపై పారినా ఇలా ముఖంపై దద్దులు, దురద రావడం, ముఖం నల్లబడటం జరుగుతుందని వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న వసతిగృహ సిబ్బంది అప్రమత్తమై హాస్టల్ లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసారు. విద్యార్థులను పరీక్షించారు. అందులో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.