39.2 C
Hyderabad
April 25, 2024 17: 02 PM
Slider పశ్చిమగోదావరి

విద్యార్ధి ఆరోగ్యంపై తక్షణమే స్పందించిన ఆరోగ్య మంత్రి నాని

#AallaNani

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గురు కుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అభినయ్ 4రోజులు గా జ్వరంతో బాధ పడుతున్నా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు.

విద్యార్థి అభినయ్ ఆరోగ్య పరిస్థితిపై తల్లి దండ్రులు వెంకటేష్, నిర్మల ఆందోళన చెందారు. తమ బిడ్డను ఆదుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని వేడుకున్నారు.

తన బిడ్డ అభినయ్ ను కాపాడాలని సోషల్ మీడియా ద్వారా పంపిన సందేశాన్ని చూసిన మంత్రి తక్షణమే స్పందించారు.

విద్యార్థి అభినయ్ ఆరోగ్యం పై నిర్లక్ష్యం గా వ్యవహరించిన చింతలపూడి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పరంజ్యోతి పై మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు.

బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్న విద్యార్థి అభినయ్ ని విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించారు.

విద్యార్థి అభినయ్ కి మెరుగైన వైద్యం అందించాలని విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమణ మూర్తి ని అదేశించారు. విద్యార్థి అభినయ్ ఆరోగ్య పరిస్థితి పై తల్లి దండ్రులకు మంత్రి భరోసా ఇచ్చారు.

Related posts

ఎన్టీఆర్ ను విమర్శించిన వారు చరిత్రహీనులు అవుతారు

Satyam NEWS

గుడ్ వర్క్: నాయీ బ్రాహ్మణ పేద కుటుంబాలకు ఆసరా

Satyam NEWS

అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా

Satyam NEWS

Leave a Comment