33.2 C
Hyderabad
April 26, 2024 02: 46 AM
Slider వరంగల్

పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ వహించ వద్దు

నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పోలీస్ కమిషనర్ పిలుపునందుకోని హైదరాబాద్ యశోద ఆసుపత్రి అధ్వర్యంలో స్థానిక భీమారంలోని శుభం కళ్యాణ వేదికలో ఏర్పాటులో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హజరయి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు సైతం గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థోపెటిక్, స్త్రీ సంబంధిత వ్యాధులకు నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు, సిబ్బందికి వైద్యులు తగు సూచనలు, సలహాలను అందజేయడం జరిగింది. ఈ శిబిరానికి హజరయిన ప్రతి ఒక్కరికి బి.పి. షుగర్ పరీక్షలను నిర్వహించడంతో పాటు, అవసరమయినవారికి ఇ.సి.జి, 2డిఇకో పరీక్షలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది మరియు వారి కుటుంబాల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల రెండు, మూడువ శనివారాల్లో వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో యశోద హస్పటల్స్ అధ్వర్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించబడుతాయని, ఈ అవకాశాన్ని సిబ్బంది వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురయితే తక్షణమే వైద్యులను సంప్రదించాలని, ప్రతి సిబ్బంది ఏడాదికి ఒక మారు తప్పనిసరిగా తనతో పాటు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం అవసమని, ఈ శిబిరంలో నిర్వహించిన పరీక్షల అనంతరం వ్యాధీ తీవ్రతను బట్టి సిబ్బందికి మెరుగైన చికిత్స అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. అనంతరం పోలీస్ కమీషనర్ తో పాటు డిసిపిలు వెంకటలక్ష్మి, పుష్పారెడ్డితో పాటు ఇతర పోలీస్ అధికారులు సైతం వైద్య పరీక్షలను చేయించుకున్నారు.
ఈ కార్యక్రమములో డిసిపిలు వెంకటలక్ష్మి, పుష్పా రెడ్డి, ఎసిపిలు నాగయ్య, శ్రీనివాస్, ఆర్.ఐ భాస్కర్, కెయూ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్లు నాగూర్, భరత్, కావ్యప్రియా, అఖిల్, సురేష్ కుమార్తో పాటు పోలీస్ఆధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మద్యంపై మళ్లీ మారనున్న జగన్ ప్రభుత్వం పాలసీ?

Satyam NEWS

ప‌ర్యావ‌ర‌ణానికి ప్రాముఖ్య‌త‌నివ్వాలి ఐఎన్‌టీయూసీ

Sub Editor

30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ

Bhavani

Leave a Comment