38.2 C
Hyderabad
April 25, 2024 12: 26 PM
Slider ప్రత్యేకం

శాల్యూట్: కోవిడ్ ధాటికి ఒరిగిపోతున్న వీర సైనికులు

#Health Workers

ప్రపంచమంతా కోవిడ్-19 విజృంభణకు వణుకుతూ అందరూ స్వీయ నియంత్రణ లో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి కనిపించని శత్రువుతో రాజీలేని యుద్ధం సాగిస్తున్న యోధులకూ కరోనా దాడి తప్పడం లేదు. వైద్యసేవలు అందించే క్రమంలో వైరస్ కు గురైన వారికి చేరువగా ఉండడం వైద్యులకు, నర్సులకు  ఇతర సహాయ సిబ్బందికి తప్పనిసరి.

స్వీయ సంరక్షణ  జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్న వారికి కోవిడ్-19 వైరస్ లక్షణాలు సోకడం ఆందోళన కలిగించే విషయం. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐ సి ఎన్) ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం… ప్రపంచ వ్యాప్తంగా కనీసం 90000 మందికి పైగా విధి నిర్వహణ లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్-19 బారినపడినట్లు తెలుస్తోంది. 

కరోనా బారిన పడుతున్న ఆరోగ్య సంరక్షకులు

30 దేశాలనుంచి సేకరించిన సమాచారం ప్రకారం అంచనా వేసినట్లు  ఐసిఎన్   ఛీఫ్ హోవార్డ్ కేటన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా4.5 మిలియన్ల  కోవిడ్-19 బాధితులకు సేవలు అందించే క్రమంలో సుమారు 2,10,000 మంది ఆరోగ్య సంరక్షకులకు వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఏప్రిల్ నెల చివరి నాటికి ఇటలీలో కరోనా విధులు నిర్వహిస్తున్న 154 మంది వైద్యులు వైరస్ బారినపడినట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థ తెలిపింది. బ్రిటన్ ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఏప్రిల్ 29 నాటికి 82 మంది ఆరోగ్య కార్యకర్తలు సహా 16మంది సామాజిక కార్యకర్తలకు వైరస్ లక్షణాలు సోకినట్లు వెల్లడించింది.

లెక్కకు చిక్కని మరణాలు ఇంకా ఉండవచ్చు

యూ ఎస్ లో ఏప్రిల్ 28 వరకు 60 మంది నర్సులతో సహా 170 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా వైరస్ సోకి మరణించినట్లు నేషనల్ నర్సెస్ యునైటెడ్ యూనియాన్ ఓ ప్రకటన లో తెలిపింది. విధులు నిర్వహిస్తూ వైరస్ సోకినవారి సంఖ్య స్పష్టం కావాల్సి ఉంది. కొన్ని దేశాలు కోవిడ్-19 బాధితులలో కోలుకున్నవారు, మరణించిన వారి  వివరాలు డబ్ల్యు హెచ్ ఓ కు అందించకపోవడంతో సమగ్ర సమాచారం తెలియని పరిస్థితి నెలకొంది.

ఇక విధులు నిర్వహణ లో వైరస్ సోకిన వైద్యులు, హెల్త్ వర్కర్లు విషయంలో కూడా మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. భారతదేశం లో  కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర లో 1000 మంది పోలీసు సిబ్బందికి వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు పరీక్షలలో తేలింది.

భౌతికదాడులను చేయడం సహించరాని నేరం

ఇటువంటి సమాచారం విధులు నిర్వహిస్తున్న కరోనా యోధులలో ఆందోళన కలిగించడం సహజం. వారిపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు కలవరం తప్పదు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా విధులు నిర్వహిస్తున్న వారిపై భౌతిక దాడులు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. వీటికి తోడు ప్రాణహాని ఉన్నట్లు అభిప్రాయం బలపడితే విధినిర్వహణలో అలసత్వం ప్రబలే అవకాశం ఉండగలదని మానసిక నిపుణులు సూచించారు.

అందుకే వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరచుగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని, తద్వారా తగిన భరోసాను  కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సాటిమనిషికి సాయం అందించే మానవసేవకు భంగం వాటిల్లితే వచ్చే ప్రమాదాన్ని ఊహించడం కష్టం. బీఎస్ ఆర్ ఎఫ్ సైనికులు, సీఆర్పీఎఫ్ జవానులకు కూడా కరోనా వదలకపోవడం గమనార్హం. కృష్ణారావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తా

Satyam NEWS

ఫెసిలిటేషన్:భరతమాతకు ప్రతిరూపమే జవాన్

Satyam NEWS

పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు

Satyam NEWS

Leave a Comment