అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జరుపుతున్న విచారణ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అయోధ్య కేసులో చివరిరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడివేడిగా సాగాయి. అయితే తీర్పును మాత్రం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. నవంబర్ 17లోగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వాదోపవాదనలను బుధవారంతో ముగిస్తామని ఇప్పటికే సంకేతాలిచ్చారు. 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు ఆయన తెలిపారు.
previous post