35.2 C
Hyderabad
May 29, 2023 21: 20 PM
Slider ప్రత్యేకం

వడగాలులతో అప్రమత్తంగా ఉండండి

#hot weather

ఏపీ లో నేడు 84 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు

అనకాపల్లి 1, బాపట్ల 6, తూర్పుగోదావరి 5, ఏలూరు 4, గుంటూరు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం

కాకినాడ 11, కోనసీమ 1, కృష్ణా 13, ఎన్టీఆర్ 15,
పల్నాడు జిల్లాలోని 11 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం

ఈరోజు అల్లూరి , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C – 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

నిన్న కృష్ణా జిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 44.5°Cలు నమోదు

తిరుపతి జిల్లా గూడూరులో 44.4°Cలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44.3°Cలు నమోదు అయిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Related posts

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి ఎంపీ రఘురామ లేఖ

Satyam NEWS

ఎర్రవాడ జనసంద్రం: కదం తొక్కిన కామ్రేడ్లు

Satyam NEWS

పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన డీజీపీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!