36.2 C
Hyderabad
April 25, 2024 19: 59 PM
Slider ప్రత్యేకం

అదనపు కలెక్టర్ కారుకు భారీగా చలాన్లు

#Heavy challans

సామాన్య ప్రజల వాహనాలకు చలాన్లు పెండింగులో ఉంటే పోలీసులు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో చలాన్లు పెండింగులో ఉంటే కనీసం సగం అయినా చెల్లించనిదే వాహనాన్ని కదలనివ్వరు. అదే తప్పు ఉన్నతాధికారులు చేస్తే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం రివాజుగా మారుతోంది. ఇక్కడ చలాన్లు పెండింగులో ఉంచిన అధికారి చిన్నచితకా అధికారి కాదు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ అధికారిక వాహనం. ఈ వాహనంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 చలాన్లు పెండింగులో ఉన్నాయంటే అధికారులు ఏ విధంగా సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారో అర్థం అవుతోంది.

జిల్లా అదనపు కలెక్టర్ కు చెందిన వాహనం టీఎస్ 17 సి 7299 నంబర్ గలా కారుపై జిల్లా బార్డర్ లోనే కాదు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా ఫైన్లు పడ్డాయి. అన్ని ఫైన్లు కూడా ఓవర్ స్పీడ్ కు చెందినవే కావడం గమనార్హం. 9 చాలన్లకు మొత్తం 9315 రూపాయల ఫైన్ పడింది. 15.02.2022 రోజు బిక్కనూర్ ఎంట్రీ, 15.04.2022 రోజు రామాయంపేట పరిధిలోని ధర్మార చెరువు ఎక్స్ రోడ్, 15.06.2022 చేగుంట పరిధిలోని హంసా రెస్టారెంట్, 11.08.2022 అల్వాల్ పరిధిలోని శామిర్ పేట టిఆర్పీఎస్ లిమిట్స్, 03.10.2022 చేగుంట పరిధిలోని వడియారం బైపాస్, 03.10.22 బిక్కనూరు పరిధిలోని బిక్కనూర్ ఎగ్జిట్, 29.12.2022 మాచారెడ్డి పరిధిలోని లక్ష్మీరావుల పల్లి, 03.01.2023 రామాయంపేట పరిధిలోని ధర్మార చెరువు ఎక్స్ రోడ్, చిక్కడపల్లి పరిధిలోని అప్పర్ ట్యాంక్ బండ్ రోడ్ లో చలాన్లు వేశారు.

ఒక్కొక్క చాలాన్ వెయ్యి రూపాయలతో పాటు చార్జీలు 35 రూపాయలు కలుపుకుని మొత్తం 9315 రూపాయలు చలాన్లు చెల్లించాల్సి ఉంది. సాధారణ ప్రజలను ఒకలా, అధికారులను మరొకలా చూడటం, వారినుంచి చలాన్లు వసూలు చేయకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు కలెక్టర్ వాహనానికి పడిన అన్ని చలాన్లు కూడా ఓవర్ స్పీడ్ కు సంబంధించినవే కావడం గమనార్హం. వేగం వద్దు.. ప్రాణం ముద్దు అని చెప్పే అధికారులకే అతివేగంతో వెళ్తుండగా ఫైన్స్ పడటం అధికారుల తీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

గతంలో కూడా కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనానికి ఇలాగే ఫైన్లు పెండింగులో ఉంటే పోలీసు శాఖ క్లియరెన్స్ చేయలేదని, టెక్నీకల్ సమస్య వల్లనే చలాన్లు పెండింగులో కనిపించాయనిఅధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పుడు అదనపు కలెక్టర్ వాహనానికి కూడా అలాగే చలాన్లు పెండింగులో ఉన్నాయి. గత సంవత్సర కాలంగా తన వాహనానికి ఉన్న పెండింగ్ చలాన్లు చూసుకోకుండా నిర్లక్ష్యం వహించడం గమనార్హం. ఈ పెండింగ్ చలాన్లపై ఇటు కలెక్టరేట్ అధికారులు, అటు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related posts

హిందూ ధ‌ర్మ‌ ప్ర‌చారానికి ఎస్వీబీసీ ఒక ఆయుధం

Satyam NEWS

మన హక్కులను మనమే కాపాడుకోవాలి

Satyam NEWS

ఈవీఎం గోడౌన్ పనుల తనిఖీ

Bhavani

Leave a Comment