Slider తెలంగాణ

కేసీఆర్ జిల్లాలో మద్యం షాపులకు ఫుల్ డిమాండ్

Beer-564x400

కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ లో మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు  వ్యాపారులు పోటీ పడుతున్నారు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ లక్కు మాత్రం దక్కితే చాలు అని పోటాపోటీగా టెండర్లు దాఖలు చేశారు. మెదక్ జిల్లాలో 38 మద్యం దుకాణాలకు అనుమతి ఉండగా 498 దరఖాస్తులు రావడం విశేషం. దీన్నిబట్టి మెదక్ జిల్లాలో మద్యం షాపులకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్ధమవుతుంది. గత ఏడాది టెండర్ కోసం రూ. లక్ష డిపాజిట్ చేయాలని నిబంధన ఉండగా ఈసారి దాన్ని రూ.2లక్షలకు పెంచారు. అయినా ఏమాత్రం వెనకాడకుండా వ్యాపారులు మద్యం షాపులను దక్కించుకునేందుకు భారీగా తరలివచ్చారు.  ఇందులో మహిళల పేరు మీదనే దాదాపు 50కి పైగా టెండర్లు దాఖలు అవడం గమనార్హం. ఈ టెండర్ల ద్వారా రూ.9కోట్ల 80 లక్షల మేర ఆదాయం సమకూరినట్లు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిలాల్లోని 38 షాపులు ఉండగా 498 దరఖాస్తులు రాగా, పాపన్నపేట్ మండలంలోని సుప్రసిద్ధ దేవస్థానం ఏడుపాయల దేవస్థానం సమీపంలోని పొడ్చన్ పల్లి  మద్యం దుకాణానికి జిల్లాలోనే అత్యధికంగా 38 దరఖాస్తులు వచ్చాయి, అలాగే మేడ్చల్ కు దగ్గరలోని కాళ్ళకల్ మద్యం  దుకాణానికి సైతం 38 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రంగంపేట్ వైన్స్ షాప్ కోసం అతి తక్కువగా 4 దరఖాస్తులు నమోదయ్యాయి. మొత్తానికి మద్యం షాపుల ద్వారా ప్రభుత్వానికి మాత్రం భారీగా ఆదాయం వచ్చి చేరుతోంది. ఇక టెండర్లలో ఎవరిని అదృష్టం వరించనుంది అన్నది త్వరలో తేలనుంది.

Related posts

నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

Satyam NEWS

జై గౌడ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతా

Satyam NEWS

మినిస్టర్స్ వాయిస్: దేశం మొత్తంలో కరోనా కేసులు 28

Satyam NEWS

Leave a Comment