31.7 C
Hyderabad
April 25, 2024 02: 28 AM
Slider ఆదిలాబాద్

రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు

#HeavyRains

అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షం బోథ్  నియోజక వర్గ పరిధిలో చేతికి వచ్చే పంట  పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క నాసిరకం విత్తనాలు, మరోపక్క అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి.

కౌలు రైతుల పరిస్థితి అయితే ఎవరికి చెప్పుకోలేని దీన స్థితిలో ఉన్నారు పెట్టుబడి పెట్టిన పైసలు వస్తాయి అని గ్యారెంటీ లేదు అని అలాంటిది అకాల వర్షాల వల్ల పెట్టుబడి కూడా ఖచ్చితంగా వస్తుందని నమ్మకం లేదని అంటున్నారు. సొయా, పత్తి దెబ్బతిందని  దెబ్బ తిన్న పత్తి ,సొయా  ప్రభుత్వమే తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

కోవిడ్ కారణంగా పత్తి ఏరే కార్మికులు లేక పత్తి   రైతులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర నుండి ప్రతి ఏటా కార్మికులు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వచ్చే వారని కానీ కోవిడ్ కారణంగా కార్మికులు రాలేకపోతున్నారని  కార్మికులు లేక రైతులకు చాలా కాష్టంగా మారిందని అకాల వర్షాలతో కాస్త వచ్చిన సైతం పత్తి చెట్టు పైనే  తడిసి చెడిపోతుందని వాపోతున్నారు.

మరో పక్క సొయా పంట కూడా వర్షానికి తడిసి పోయి పూర్తిగా చెడిపోతుందని అంటున్నారు ఆరు కలల పాటు కష్టపడి సాగు చేసి చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో నష్ట పోతున్నామని అంటున్నారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో వ్యవసాయ సాగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున భూమి సాగులోకి వచ్చింది.

మిషన్ కాకతీయ వల్ల చెరువు పూర్తిగా నిండిపోయి భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయనికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు  ఏది ఏమైనా పుండు మీద కారం చల్లినట్టు ఉంది రైతుల పరిస్థితి. ఈ రోజు బోథ్ నియోజకవర్గ కేంద్రంలో  BJP పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే  ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా OBC అధ్యక్షుడు గొర్ల రాజు యాదవ్ , జిల్లా నాయకులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనం…!

Bhavani

క‌రోనా భ‌యం..అందుకే అదుంటే ఎంతో అభ‌యం..!…ఏమిట‌ది..?

Satyam NEWS

నిన్నటి వరకూ బిర్యానీ పంచిన చేతులు నేడు కరోనా…

Satyam NEWS

Leave a Comment