27.7 C
Hyderabad
March 29, 2024 01: 27 AM
Slider మెదక్

వరి ధాన్యం కొనేందుకు తెలంగాణ వస్తున్న పక్కరాష్ట్రాల మిల్లర్లు

#harishrao

రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రైతులకు బావుల వద్ద మోటార్లకు మీటర్ పెట్టి రైతులకు బిల్లులు వేయాలని చూస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు ఆయన ప్రారంభించారు. అక్కడ సరిగ్గా వరిధాన్యం పండక పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి మిల్లర్లు వరిధాన్యం కొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారని ఆయన అన్నారు.

ఒకప్పుడు పని లేక ఇబ్బంది పడ్డ మనము. ఇప్పుడు ఇతర ప్రాంతాల వారికి వ్యవసాయ కూలీలుగా అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప. రాజకీయం కోసం కాదు.తె లంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరిధాన్యం ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నల కోసం రాష్ట్రంలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వాగులు, నదులపై  చెక్ డ్యాముల నిర్మాణం వలన రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగాభూగర్భ నీటి వనరుల అభివృద్ధి చెంది రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల వారి ధాన్యం ఒక సీజన్లోనే పండుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్రం ఏర్పడే నాటికీ జిల్లాలో లక్ష నుండి లక్షన్నర మెట్రిక్ టన్నుల వరిధాన్య పండగ ప్రస్తుతం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించడం వలన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వలన అధిక పంట ఉత్పత్తి సాధ్యమైంది. గతంలో ఏసంగీ పంట అంటే వెనుక మడి ఎండకుండా పంట పండేది కాదు. ఇవాళ గుంట కూడా ఎండకుండా బంగారం లాగా రెండు పంటలు పండుతున్నాయి. గతంలో వాన కాలం వచ్చిందంటే వర్షాల కోసం రైతులు ముఖాలను మొగులు వైపు పెట్టి వర్షాల కోసం ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు వర్షాల కోసం ఎదురుచూడవలసిన అవసరం లేదు వాన కాలమైన, ఎండాకాలమైనా నీటికి కొదువ లేదు. రంగనాయక సాగర్ నింపుకొని ఆ నీటిని జిల్లాలోని అన్ని చెరువులను నింపి పొలాలకు నీటిని అందిస్తున్నాం అని ఆయన తెలిపారు.

కొంతమంది హైదరాబాద్ లో కూర్చుని కాలేశ్వరం ఫలితం రాలేదని ఎద్దేవా చేస్తున్నారు. వారు హైదరాబాద్ ని వదిలి గ్రామాల్లో తిరిగితే పచ్చని పల్లెలలో ఉండే రైతులు సమాధానం చెప్తారు. భూగర్భ జలాల సమృద్ధిగా ఉండడంతో కొత్తగా బోర్లు వేయాల్సిన అవసరం లేక పల్లెల్లో బోరుబండ్లు, క్రేన్లు కనబడడం లేదు. రంగనాయక సాగర్ తో అన్ని గ్రామాల్లో చెరువులు, పంట పొలాలను నింపుతున్నాము. ఈసారి పెదవాగులోకి కూడా వీటిని వదిలి చెక్ డ్యాములను నింపనున్నాము అని ఆయన తెలిపారు. వరిధాన్యానికి క్వింటాలకు  2060 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.  

చివరి గింజలకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాము. రైతులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలి. ధాన్యం ఎండేలా కోసిన వెంటనే రెండు రోజులు పొలంలో ఎండబెట్టుకొని  కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. పరిధాన్యం కొన్న మూడు రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం నిధులను సమకూర్చిందని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కూడా పాల్గొన్నారు.

Related posts

మునక వాసుల పొలాలకు పరిహారం చెల్లించాలి

Satyam NEWS

సానుకూల స్పందనతో పరుపు నిలుపుకున్న కాంగ్రెస్

Satyam NEWS

వీర తెలంగాణ అగ్గిరవ్వ దొడ్డి కొమరయ్య

Satyam NEWS

Leave a Comment