40.2 C
Hyderabad
April 19, 2024 17: 49 PM
Slider మహబూబ్ నగర్

కృష్ణా నది తీర గ్రామ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

#ramesh

రాష్ట్రంలో నిలకడక లేకుండా కురుస్తున్న వర్షాలకు కొల్లాపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్లాపూర్ తాహాశీల్దార్ వి.రమేష్ సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో  మాట్లాడారు. గత నాలుగు రోజుల నుండి కుండపోతల కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో  కృష్ణా నదికి భారీగా  వరదలు వస్తున్నాయన్నారు. కనుక నది తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. నది తీరా గ్రామాలు సోమశిల, అమరగిరీ, మోలచింతలపల్లి  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది తీర ప్రాంతాలకు వెళ్లొద్దని  ఆయన ప్రజలను హెచ్చరించారు.

భారీ వర్షాల కారణంగా ముందస్తు చర్యలు

భారీ వర్షాల కారణంగా మట్టి మిద్దెలు, గుడిసెలు, పాత ఇండ్లలలో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి  ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.భారీ వర్షాలకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రజలకు ప్రత్యేక సెల్టార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల పరిధిలో ఉన్న పాఠశాలలో, రైతు వేదికలను, ప్రభుత్వ కార్యాలయాలను కూడా ప్రజల కోసం కేటాయించినట్లు చెప్పారు.ఎవరి ఇండ్లైన ప్రమాదానికి గురైతే వారికి ఉండడానికి ఏర్పాట్లు  చేసినట్లు తెలిపారు.మండల పరిధిలో రెవెన్యూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రజలు బయటకు రావద్దని, ముఖ్యంగా నాది తీర ప్రాంతాలకు జాలర్లు, మేకల కాపరులదారులు వెళ్లొద్దని చెప్పారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

సెక్యూరిటీ తిప్పి పంపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

పని చేసే సంస్కృతి పెంచుకుందాం రండి

Satyam NEWS

శ్రీనివాస్ గౌడ్ కు జెడ్ కేటగిరీ భద్రత

Sub Editor 2

Leave a Comment