28.2 C
Hyderabad
April 20, 2024 12: 57 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలోని చాలా ప్రాంతాలకు వానగండం

#HeavyRainsinTelangana

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్, కరీంనగర్ , నిజామాబాద్ , వరంగల్ , ఖమ్మం జిల్లాలలో భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల వలన వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉంది.

వర్షాల వలన వరదలు సంభవించడం తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, పడిపోవడం వలన సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది.

రిజర్వాయర్లు , చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వలన లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు, కాజివేలలో నీరు ప్రవహించే అవకాశం ఉంది. ట్రాఫిక్ అంతరాయాలు, ప్రజలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.

జిల్లా యంత్రంగం మొత్తం అప్రమత్తంగా ఉండి  ఇంతకు ముందే జారీ చేసిన Flood Protocol తప్పని సరిగా ఫాలో కావాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ విషయంమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను, ఎస్.పి.లను అప్రమత్తంగా ఉండాలని పరిస్థితులను ఎప్పడికప్పుడు గమనించాలని అన్నారు.

అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts

సినీ కార్మికులను ఆదుకున్న మంత్రి తలసాని

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కు సంచుల కొరత

Bhavani

ఏజెన్సీ ప్రాంత యువకులు అన్ని రంగాల్లో రాణించాలి

Murali Krishna

Leave a Comment