కోస్తాంధ్ర, తెలంగాణాతోపాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, కొంకణ్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ ఘడ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, మరాఠ్వాడ, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేర మంగళవారం ఉదయం ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరిక బులిటిన్ జారీ చేసింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దక్షిణ ఒడిశా, పశ్చిమబెంగాల్, అండమాన్, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
previous post