28.7 C
Hyderabad
April 20, 2024 10: 31 AM
Slider హైదరాబాద్

విజయవాడ నుంచి హైదరాబాద్ కు భారీగా గంజాయి స్మగ్లింగ్

# smuggling

విజయవాడ నుంచి హైదరాబాద్ కు భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నది. నల్లగొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా ను ఒక కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా ఈ విషయం బయటపడ్డది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవాను అనుమానంతో ఆపే ప్రయత్నాన్ని పోలీసులు చేయగా భయపడి వెంటనే విజయవాడ వైపు తిప్పి పారిపోవడానికి ప్రయత్నం చేశారు.

దాంతో గంజాయి స్మగ్లర్స్ ఉన్న ఇన్నోవా వెహికల్ ని హైదరాబాద్ వెస్ట్ జోన్ ఎస్ ఓ టి పోలీసులు వెంబడించారు. తప్పించుకునే ప్రయత్నం లో చిట్యాల మండలం బొంగోని చెర్వు వద్ద ఇన్నోవా పల్టీ కొట్టింది. ఇన్నోవాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 65 హైవే లో పోలీసులను తప్పించుకునే క్రమంలో వెలిమినేడు నుంచి బొంగోని చెర్వు రోడ్డు లో పల్టీ కొట్టింది ఇన్నోవా. ఇన్నోవాను వదిలి గంజాయి స్మగ్లర్లు పారిపోయారు.

కారులో భారీగా పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం స్పెషల్ టీం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.

Related posts

రామాంతపూర్ లో వైభవంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Satyam NEWS

రుణమాఫీ కోసం 18,241.94కోట్లు విడుదల

Bhavani

ఆంక్షలున్నా అందాల పోటీలు నిర్వహిస్తాం.. ఇజ్రాయెల్‌

Sub Editor

Leave a Comment