36.2 C
Hyderabad
April 25, 2024 19: 05 PM
Slider ప్రత్యేకం

రాబోవు నాలుగు రోజుల పాటు ఏపీలో అత్య‌ధిక ఉష్టో్గ్ర‌త‌లు..!

#daytempatature

అత్య‌వ‌ర‌మైతే త‌ప్ప‌… ఇంట్లోనే ఉండాలంటున్న స‌త్యం న్యూస్.నెట్

మండే ఎండలు…..!… భానుడు భ‌గ‌..భ‌గ‌… మాడు ప‌గులుతోంది…!.. అడుగు పెట్ట‌లేని ప్ర‌జ‌….! 23నుంచీ 26 వ‌ర‌కు 43 నుంచీ 46 డిగ్రీల న‌మోదు..! 4 రోజుల పాటు త‌ప్ప‌ద‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌..!

మీరు చ‌దివింది నిజ‌మే…అక్ష‌ర స‌త్యం…న‌మ్మ‌లేని నిజం…స్వయంగా భాత‌ర వాతావ‌ర‌ణ  శాఖ చెప్పిందా…గ‌ణాంకాలు.

రాబోవు నాలుగు రోజులలో రాష్ట్రంలో అత్య‌ధిక ఉష్టోగ్ర‌త‌లు న‌మోదుఅవుతాయ‌ని.భార‌త వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర‌ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్  మాట్లాడుతూ…వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని…,  డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని కోరారు.

వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈమేర‌కు ఈ నెల 23 నుంచీ 26  వ‌ర‌కు అత్య‌దిక ఉష్టో్గ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు.ప్ర‌ధానంగా  విజ‌య‌న‌గ‌రం,పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల‌లో 41 మండ‌లాల‌లో  వడగాల్పుల ప్రభావం ఉంటుందని చెప్పారు.

ప్ర‌ధానంగా… అల్లూరి  సీతారామరాజు, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో  43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 24 ఆదివారం పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో  45°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇక‌సోమ‌వారం 25 వ తే అల్లూరి  సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, నంద్యాల,  జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో  45°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇక ఈనెల 26 మంగళవారం శ్రీకాకుళం, అల్లూరి  సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,  నంద్యాల,  వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భాత‌ర వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఐఎండీ సూచ‌న‌ల‌ను,జాగ్ర‌త్త‌ల‌ను ఉటంకిస్తున్న స‌త్యం న్యూస్.నెట్.. ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం ప్ర‌ధాన ఉధ్దేశ్యం కాకుండా..క‌నీస జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని అంటోంది.

Related posts

మంత్రి అల్లోలకు శుభాకాంక్షల వెల్లువ

Satyam NEWS

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

Satyam NEWS

కేసీఆర్ ముఖ్యమంత్రా? లేక కాంట్రాక్టర్ల బ్రోకరా?

Satyam NEWS

Leave a Comment