ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగరం సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. రైసీ హెలికాప్టర్ క్రాష్ వార్తల నేపథ్యంలో ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఆ దేశ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్లు టెహ్రాన్ టైమ్స్ నివేదించింది. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నారని, కాన్వాయ్‌తో తబ్రిజ్‌కు బయలుదేరారని కూడా సమాచారం వెల్లడైంది. ఇవన్నీ అనధికారిక సమాచారాలే కావడంతో తమ అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం పై ఆ దేశ ప్రజలు తల్లడిల్లుతున్నారు.
previous post