అమెరికాలోని ఫ్లోరిడాలో హెలెనా హరికేన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు 44 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాలోనూ హరికేన్ ఎఫెక్ట్ ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో 20 మిలియన్ డాలర్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 225 కిలోమీటర్లకు పైగా వేగంతో కూడిన గాలులతో ఫ్లోరిడా సహా జార్జియా, నార్త్ కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. జలఖడ్గం విసిరింది. ఫ్లోరిడా లోని బిగ్‌బెండ్ ప్రాంతంలో ఈ హెలీన్ హరికేన్ శుక్రవారం రాత్రి తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు140 కిలోమీటర్ల వేగంత గాలులు వీయడంతో బిగ్ బెండ్ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
previous post