హెలికాప్టరులో ఆయుధాలను తీసుకువెళుతుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మిలటరీ విభాగానికి చెందిన ఇద్దరు పైలట్లు మరణించిన ఘటన ఆఫ్ఘనిస్థాన్ దేశంలో జరిగింది. ఫర్హా ప్రావిన్సు పరిధిలోని పోర్చమాన్ జిల్లాలో ఏఏఎఫ్ హెలికాప్టరులో ఆఫ్ఘనిస్థాన్ మిలటరీ విభాగానికి చెందిన ఇద్దరు పైలట్లు ఆయుధాలను తీసుకువెళుతుండగా పోర్చమాన్ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆఫ్ఘాన్ మిలటరీకి చెందిన ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మరణించారు.ఈ ప్రమాద ఘటనను ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖ మంత్రితోపాటు ఫర్హా గవర్నరు ముహమ్మద్ షోయబ్ సాబేత్ లు వెల్లడించారు.