28.7 C
Hyderabad
April 20, 2024 04: 38 AM
Slider వరంగల్

ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ హెల్మెట్ ధరించాలి

#mulugu dist

మొక్కల సంరక్షణ ఎంత ప్రాధాన్యం మనిషి ప్రాణం కూడా అంతే విలువైనదని ఫారెస్ట్ ఆఫీసర్ లు సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించి బైక్ నడిపే అలా చర్యలు తీసుకోవాలని ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య కోరారు.

బుధవారం ములుగు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ శెట్టి కి హెల్మెట్ అందజేసిన ఏఎస్పి.ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని ఆఫీసర్ సిబ్బంది హెల్మెట్ ధరించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో భాగంగా నిత్యం బైక్ పై తిరిగే ఆఫీసర్లు, సిబ్బంది అనుకోని ప్రమాదాలకు గురి అవుతున్నారని, అయితే మనిషికి అత్యంత ముఖ్యమైన తల భాగానికి రక్షణ కవచంగా హెల్మెట్ ధరిస్తే తప్పనిసరిగా ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చని సూచించారు.

బైక్ ల పై ప్రయాణించే సందర్భంలో కుటుంబాలను గుర్తు చేసుకోవాలన్నారు. అడవుల సంరక్షణ తో పాటు మొక్కలను ఎంత అపురూపంగా చూసుకుంటారో అదేవిధంగా తమ ప్రాణాలు కూడా శ్రద్ధ వహించాలని ఆరోగ్యంగా ఉంటూ ప్రమాదాల నివారణకు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు.

అందుకు స్పందించిన బిఎఫ్  ప్రదీప్ కుమార్ శెట్టి తప్పనిసరిగా ఫారెస్ట్ సిబ్బంది హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా అటవీశాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో హెల్మెట్లు ధరించి విధులకు హాజరైతే  సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతంగా ఉంటుందని ఈ సందర్బంగా ఎఎస్పి  సాయి చైతన్య అన్నారు.

Related posts

‘జీ 5’లో డిసెంబర్ 4న ‘కోమాలి’ ప్రీమియర్

Satyam NEWS

విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు

Satyam NEWS

ఆశా వర్కర్లకు నిత్యావసరాలు, నగదు పంపిణీ

Satyam NEWS

Leave a Comment