37.2 C
Hyderabad
March 29, 2024 20: 25 PM
Slider రంగారెడ్డి

మనిషిని చూడు మనిషిలోని అవిటితనాన్ని కాదు

#uppala

మనిషిని చూడాలి కానీ మనిషీలోని అవిటి తనాన్ని చూడకూడదని ఉప్పల వెంకటేష్ అన్నారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకల్యంతో ఎన్నో అవరోధాలను కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని జయిస్తూ ప్రతి మానవుడికి స్ఫూర్తిగా జీవిస్తున్న వికలాంగుల అంగవైకల్యాన్ని చూడరాదని మనిషి మనసును చూడాలని ఆయన సూచించారు.కళలకు ఏది అడ్డు కాదని ఆత్మస్థైర్యమే అన్నిటికీ సులభతరమైన మార్గమని ఆయన తెలిపారు.

మనిషికి వివిధ ప్రమాదాల ద్వారానో పుట్టక ద్వారానో అవిటితనం వచ్చిన వారిని చులకన భావంతో చూడ కుండా
వీరికి చేయూత నందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించబడుతుందన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుందని తెలిపారు.వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై,1998 నుండి ప్రతి సంవత్సరం వికాలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని తెలిపారు.

అదేవిధంగా నేడు స్వతంత్ర సమరయోధులు భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. బాబు రాజేంద్రప్రసాద్ భారతదేశానికి చేసిన సేవలు గూర్చి కొనియాడారు. అనంతరం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం న్యాలట గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలో విద్యనభ్యసిస్తున్న 64 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు.

Related posts

గద్దర్ అన్నకి నివాళి

Satyam NEWS

నిజాముద్దీన్ మర్కజ్‌ మసీదు ఎపిసోడ్ లో కీలక ఆదేశాలు

Satyam NEWS

దాతృత్వం చాటుకున్నశ్యాంపిస్టన్స్ కార్మికులు

Sub Editor

Leave a Comment