గత 45 రోజులుగా ఆటోలు రోడ్డు ఎక్కక పోవడంతో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. చేతిలో పని లేకపోవడంతో చిల్లి గవ్వ చేతికి రావడం దుర్లభం గా మారింది. ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకు కుచించుకు పోతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి లో వారున్నారు.
లాక్ డౌన్ మరో మూడు వారాల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ఉపాధి వారికి దగ్గర్లో కనిపించడం లేదు. ఆటోలు నడవక పోవడంతో ఆదాయం లేక కుటుంబం పోషణ సందిగ్ధంలో పడింది. వారి పరిస్థితులను తెలుసుకున్న స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ఆటోవాలాల ను ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. బుధవారం రోజున ఆటో నడిపే వారిని పిలిపించుకుని ఇతోధిక సహాయాన్ని అందించారు.
సంఘటితంగా ఉన్న వారికి రూ. 10000 ఆర్ధిక సహాయాన్ని అందించారు. కరోనా కట్టడి జరిగి అన్ని వర్గాలకు చెందిన ఉపాధి పనులు ప్రారంభం కావాలని వెంకట్ రెడ్డి ఆశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, నాయకులు జిట్టా బొందయ్య, దాసరి నర్సిహ్మ తదితరులు పాల్గొన్నారు.