30.7 C
Hyderabad
April 17, 2024 01: 05 AM
Slider నల్గొండ

కరోనా కష్ట సమయంలో పేదలకు సాయం అభినందనీయం

#corona help

కరోనా కష్ట సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్న పేదవారికి సహాయం చేయడం అభినందనీయమని జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గోపాలపురం గ్రామానికి చెందిన అపరంజి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం కోర్టులో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు, గుమస్తా లకు నిత్యవసర వస్తువులు,కురగాయలు పంపిణీ చేసిన అనంతరం తేజ చక్రవర్తి మాట్లాడారు.

అపరంజి స్వచ్ఛంద సంస్థ మున్ముందు కూడా ఇలాగే పేదల అభ్యున్నతి కొరకు సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. తన వంతు సహాయంగా ఐదువేల రూపాయలను కోర్టులో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు,గుమస్తాలకు విరాళం ప్రకటించి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ‌మన్నూరి కాశయ్య, వైస్ చైర్మన్ గురుమాల, ట్రస్ట్ సభ్యులు పొదిల సితార రాజుకుమారు, ఏలిషా, మిర్యాము శ్రీదర్, సంద్య,బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, న్యాయవాదులు చల్లా కృష్ణయ్య, కుక్కదపు సైదులు,కమతం నాగార్జున, పిడమర్తి చంద్రయ్య,చనగాని యాదగిరి ,  చనగాని మహేష్,కొట్టు సురేష్,రమణారెడ్డి, ట్రస్ట్ చైర్మన్, కోర్టు సూపరింటెండెంట్ నాగ ఆంజనేయులు, సైదులు, రోజా, మౌనిక , సైదా నాయక్, రమ్య, రవి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

జెఈఈ (మెయిన్) ఫలితాలలో శ్రీచైతన్య కొత్త రికార్డు

Satyam NEWS

మూడేళ్లుగా వేధిస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment