37.2 C
Hyderabad
March 29, 2024 20: 34 PM
Slider కృష్ణ

హోంగార్డు కుటుంబానికి ఆర్ధిక సహాయం అంద‌జేత

#VijayawadaCP

గత కొంత కాలంగా విజయవాడ నగరంలో పనిచేస్తున్న హోంగార్డుల్లో ఎవరైనా మరణించినా లేక పదవీ విరమణ చేసినా వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం ఉండదు కనుక, దీని వలన మరణించిన లేదా పదవీ విరమణ చేసిన హోంగార్డు కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఆ కుటుంబాల వారు ఇబ్బందులు పడకుండా ఉండటానికి నగరంలో పనిచేస్తున్న హోంగార్డులు అందరూ కలిసి స్వచ్ఛందంగా వారికి వచ్చే వేతనం నుండి సదరు చనిపోయిన లేదా పదవీ విరమణ చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న విషయం విదితమే.

అందులో భాగంగా విజయవాడ హోంగార్డు యూనిట్ నందు హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ మార్చి 24న గుండెపోటుతో ఎల్.శ్రీనివాసరావు(హెచ్.జి-129) మృతి చెందగా ఆయ‌న భార్య ఎల్.బాల భవానికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమ‌వారం పోలీస్ కమిషనర్ బ‌త్తిన శ్రీనివాసులు రూ.5 లక్షలు నగదు చెక్కును అందజేశారు.

కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి మేరి ప్రశాంతి, హోంగార్డ్సు ఆర్.ఐ.శిరీష, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంచి మనసున్న కేసీఆర్ కే ఇలా చేయడం సాధ్యం

Satyam NEWS

ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు

Satyam NEWS

అన్యాయం చేసే ఆర్డినెన్స్‌ 2ను రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment