37.2 C
Hyderabad
March 29, 2024 18: 30 PM
Slider వరంగల్

ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు

#mulugu asp

ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ములుగు ఏఎస్పి సాయి చైతన్య   చేతుల మీదుగా 30 నిరుపేద కుటుంబాలకు నిత్యవసర  సరుకులు అందించింది.

ములుగు జిల్లాలోని పాత గోదాం  అవరణలో గుడారాలు వేసుకొని దాదాపు 30 నిరుపేద కుటుంబాలు నివసిస్తుంటాయి. వీరంతా  ఆర్థికంగా ఎంతో వెనుకబడిన వారు.

ఇల్లు లేదు, గుంట భూమి కూడా లేకుండా అక్కడక్కడ నివాసం ఉంటూ కాలం వెళ్లదీస్తుంటారు.

ఈ విషయం తెలుసుకున్న ఆకుతో ట అన్వేష్ తన సంస్థ ద్వారా దాదాపు 30 నిరుపేద కుటుంబాలకు కుటుంబానికి 5కిలోల బియ్యం 9 రకాల నిత్యవసర సరుకులు (పసుపు, కారం,ఉప్పు,అల్లం,సబ్బులు,చెక్కెర, చపత్త, కాల్గాటే పేస్ట్,నూనె) వస్తువులను అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ములుగు ఏ ఎస్ పీ పోతరాజు సాయి చైతన్య, సిఐ శ్రీధర్  హాజరై సరుకులను వారికి అందించారు.

ఈ సందర్భంగా ఏ ఎస్ పీ మాట్లాడుతూ అన్వేష్ ఇంత  చిన్న వయసులోనే  పేదలకు సహాయం చేసే కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వాలంటర్స్ అకుతోట సంపత్, సిద్దు, నాగరాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

శాల్యూట్: ఇండియన్ నావీ ప్రతిష్టాత్మక ఆపరేషన్ మొదలు

Satyam NEWS

మళ్లీ కనిపిస్తున్న ఎల్టీటీఈ కదలికలు

Satyam NEWS

Leave a Comment