కార్తి హీరోగా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఖైదీ. తమిళం, తెలుగు భాషల్లో దీపావళి కానుకగా ఈనెల 25న రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ఈ ట్రైలర్ ఖైదీ సినిమాపై అంచనాలను పెంచింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కార్తి మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల జైలు జీవితం ముగించి బైటికొచ్చిన ఖైదీ ఆది శంకరం పాత్ర చేస్తున్నా. అతనికొక కూతురుంటుంది కానీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కేవలం కూతుర్ని చూడ్డానికి వెళ్తున్న ఖైదీ తండ్రికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఆమెను చూశాడా? లేదా? అన్నదే ఖైదీ సినిమా కథ. ఈ కథలో యాక్షన్, ఎమోషన్ రెండూ ఉన్నాయి ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని నమ్మే ఈ సినిమా చేశానని కార్తీ చెప్పాడు. తెలుగు ఆడియన్స్ తనని ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారని, ఖైదీ సినిమాలో వాళ్లని మెప్పించే అంశాలు చాలా ఉంటాయి, ఇది తప్పకుండా న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ సినిమాలో ఉంటుందని కార్తీ చెప్పాడు. ఖైదీ సినిమా నాలుగ్గంటల్లో జరిగే కథ, అందుకే ఈ సినిమాలో పాటలు ప్రేమ ఉండవు. దాదాపు సినిమా అంతా నైట్ టైములోనే జరుగుతుంది కాబట్టి దీనికోసం 60 నైట్స్ వర్క్ చేశాం. దీపావళికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఆదిరిస్తారని ఆశిస్తున్నానని కార్తీ చెప్పాడు.