25.2 C
Hyderabad
March 22, 2023 21: 17 PM
Slider సినిమా

నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా చివరి క్షణం ఫస్ట్ లుక్

chivari-kshanam-first-look

రత్న మేఘన క్రియేషన్స్ పతాకం పై  శ్రీరాముల నాగరత్నం సమర్పిస్తున్న చిత్రం ‘చివరి క్షణం’. ధర్మ దర్శకత్వంలో ఆదిత్య శశాంక్, కవిత మహతో  హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ చేతులమీదుగా విడుదల చేయించారు. ఈ  సందర్భంగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ హీరో శ్రీకాంత్ మాచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందుకు ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం. అయన విడుదల చేసిన కొద్ది సమయంలోనే విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఇక ఈ ‘చివరిక్షణం’ సినిమా విషయానికి వస్తే హైదరాబాద్, మంచిర్యాల లొకేషన్స్ లో టాకీ పార్ట్, ఒక సాంగ్ ను  షూట్ చేసాము. మిగిలిన మూడు పాటలను గోవాలో షూట్ చేశాము. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి అతి త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలియచేసారు. 

Related posts

రైతు కార్మిక ఐక్యతతో దేశద్రోహ విధానాలు తిప్పి కొడతాం

Satyam NEWS

దత్తాత్రేయను కలిసిన డిఐజి రంగనాధ్, కలెక్టర్ పాటిల్

Satyam NEWS

మేక కడుపున వింత జంతువు.. మనిషి తల..పంది శరీరం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!