దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని అందువల్ల దక్షణాది రాష్ట్రాలు తీర ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. సైన్యం దక్షిణ కమాండ్ లెఫ్టెనెంట్ జనరల్ ఎస్ కె సయాని పూనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతో తీర ప్రాంతాల్లో గుర్తు తెలియని పడవులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సర్‌క్రిక్ ప్రాంతంలో గుర్తు తెలియని పడవలు కనిపించడంతో దక్షి ణాది రాష్ట్రాల్లోని తీర ప్రాంతా ల్లో హై అలర్ట్ ప్రకటించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ‘‘సర్ క్రిక్ ప్రాంతంలో గుర్తు తెలియని బోటులు మాకు కనిపించాయి. వారు బోట్లు వదిలేసి వెళ్లి పోయారు. ఆ బోట్లో ఉన్నవాళ్లు ఎటు వెళ్లిపోయారో అన్నది గుర్తించాల్సి ఉంది.. ఆ బోట్లో వచ్చిన అగంతకులు ఉగ్రవా దులా? అన్నది తెలియాల్సి ఉంది.’’ఈ నేపథ్యంలో సర్‌క్రిక్ నుంచి సముద్రమార్గంలో వెళ్లడానికి ఏయే రాష్ట్రాలకు అవకాశం ఉంది.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమంతా అప్రమ త్తంగా ఉండాలని సైనీ సూచించారు.
previous post
next post