28.7 C
Hyderabad
April 20, 2024 04: 18 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

దేశంలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

delhi-alert

కాశ్మీర్ అంశంపై భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లోని పలు పట్టణాలలో దాడులకు తెగబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం అందడంతో దేశ వ్యాప్తంగా కేంద్రం హై ఎలర్ట్ ప్రకటించింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు తమకు అప్ డేట్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీ ,రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక , ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా హెచ్చరికలు జారీ చేశారు. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు సామాన్య ప్రజానికమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది.

Related posts

కరోనా వ్యాప్తిపై అవగాహనతో ప్రజలు మెలగాలి

Satyam NEWS

ఉద్యమకారులు టీఆర్ఎస్ ను వీడి బయటకు రావాలి

Satyam NEWS

పంజాబ్ సీఎం చన్నీ కీలక వ్యాఖ్యలు

Sub Editor

Leave a Comment