వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరూతూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు హైకోర్టు వాయిదా వేసింది. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలలో ఉన్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టును కోరగా అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
దీనిపై జగన్ హైకోర్టుకు వెళ్లారు. జగన్ దాఖలు చేసిన వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ పై హైకోర్టు విచారణ ఆరంభించింది. సీబీఐ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి హైకోర్టు అదేశం ఇచ్చింది.