హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అసెంబ్లీకి కొత్త బిల్డింగ్ కట్టాలన్న టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇప్పుడు ఎర్రమంజిల్ హెరిటేజ్ భవనంలో ఎటువంటి తవ్వకాలు కానీ కూల్చివేతలు కానీ చేయరాదని ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు చేసిన మంత్రివర్గ నిర్ణయాన్ని కొట్టివేసింది. అసెంబ్లీకి కొత్త భవనం నిర్మాణం, ఎర్రమంజిల్ భవనం కూల్చివేత నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు సహా.. స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు, నిజాం వారసులు పిటిషన్లు వేశారు. ఇప్పటికే 21రోజులుగా దీనిపై హైకోర్టులో పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషన్లపై మూకుమ్మడిగా దర్యాప్తు చేసింది హైకోర్టు. తీర్పుపై డ్రాఫ్ట్ నోట్ విడుదలచేసింది. ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఎర్రమంజిల్ కూల్చి అసెంబ్లీ కట్టాలని రాష్ట్ర క్యాబినెట్, ప్రభుత్వం తీసుకున్న తీర్మానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎర్రమంజిల్ భవనం కూల్చి.. అక్కడే కొత్త అసెంబ్లీ భవనం కట్టాలని జూన్ 18న సీఎం కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసేందే. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు దీనిని తప్పుపట్టాయి. కోర్టులో అనేక పిటిషన్లు వేశాయి. వీటిపై విచాణ చేస్తూ తీర్పు చెప్పిన హైకోర్టు గతంలో 294 మందికి ఉపయోగపడిన అసెంబ్లీ ఇప్పుడు ఎందుకు ఉపయోగపడకుండా పోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది వేస్ట్ ఆఫ్ మనీ అని పిటిషన్లు చేసిన వాదనతో ఏకీభవించింది. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం అవసరం లేదని కామెంట్ చేసింది. ఎర్రమంజిల్ ఏరియాలో కొత్త భవనం అసలే నిర్మించొద్దని ఆ భవనానికి రిపేర్లు చేయొద్దని ఆర్డర్స్ ఇచ్చింది.
previous post