మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్ననళిని పెరోల్ పొడిగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన కుమార్తె పెళ్లి ఏర్పాట్ల కోసం పెరోల్ కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జూలై 5న వాదనలు విన్న హైకోర్టు నళినికి నెల రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నళిని జూలై 25న జైలు నుంచి విడుదలైంది. ఈ నెల 15 నాటికి అంటే రేపటికల్లా ఆమె పెరోల్ సమయం ముగియనుంది. తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు ఇంకా ముగియలేదని, తన పెరోల్ ను ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించాలని ఆమె హైకోర్టును కోరింది. అయితే నళిని పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు ముద్దాయిలు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు.
previous post
next post