టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి భద్రత వ్యవహారంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్లోజ్ డ్ సెక్యూరిటీ ఎవరి పని అనే అంశంపై ఎన్ ఎస్ జీ, స్టేట్ సెక్యూరిటీ మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. అలాగే, చంద్రబాబు కాన్వాయ్ లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు సీఎస్ వోను ప్రభుత్వం నియమించవచ్చని హైకోర్టు తెలిపింది. తన భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టులో ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు తీర్పును రిజర్వు చేశారు. తాజాగా నేడు ఆ కేసుపై తుది తీర్పును వెల్లడించారు.
previous post
next post